యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారు
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా కొండపి మండలం నెన్నూరుపాడులో ఎం.ఎస్.ఎం.ఈ పార్క్ ఏర్పాటు శుభ పరిణామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ…..రాష్ట్ర యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ దేశ విదేశాలు తిరిగి పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కనిగిరి పర్యటనలో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఎం.ఎస్. ఎం. ఈ పార్కులకు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. అందులో భాగంగా ప్రకాశం జిల్లా కొండపి మండలం నెన్నూరుపాడులో రూ.7 కోట్ల పెట్టుబడులతో ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఎం.ఎస్.ఈ పార్క్ ద్వారా కొండపి నియోజకవర్గంలోని యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వందలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో ఎం. ఎస్. ఎం. ఈ పార్క్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, మంత్రి నారా లోకేష్ కి కొండపి నియోజకవర్గ ప్రజల తరపున మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కృతజ్ఞతలు తెలిపారు.
