తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కొత్తపట్నం పోలీసు స్టేషన్ పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓపెన్ బూజింగ్ చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకొని, అక్కడి బహిరంగ మద్యం సేవన స్థలాలను పూర్తిగా క్లియర్ చేశారు.కొత్తపట్నం ఎస్సై ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజా ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్ట విరుద్ధమని, ఇటువంటి చర్యలు ప్రజలకు ఇబ్బందులు మరియు భద్రతా సమస్యలు కలిగిస్తాయని పోలీసులు తెలిపారు. ప్రజల శాంతి భద్రత కోసం ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని చెప్పారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *