తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు పరిపాలనాత్మక వ్యవస్థను బలోపేతం చేయడం, పోలీస్ స్టేషన్ల పనితీరు నాణ్యతను పెంపొందించడం లక్ష్యంగా ఒంగోలు టూ టౌన్ సీఐ ఎం. శ్రీనివాసరావు గారు, కొత్తపట్నం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.ఈ సందర్శన సందర్భంగా సీఐ పోలీస్ స్టేషన్‌లోని ముఖ్యమైన స్టేషన్ రికార్డులు, FIR రిజిస్టర్లు, పిటిషన్ రికార్డులు, లా & ఆర్డర్ ఫైళ్లను, స్టేషన్ డైరీలను వివరంగా పరిశీలించారు.స్టేషన్ సిబ్బందితో మాట్లాడుతూ—
కేసుల నమోదు మరియు దర్యాప్తు ప్రక్రియను సమయపాలనతో నిర్వహించాలి

స్టేషన్ రికార్డులు అప్డేట్‌ చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు

ప్రజలకు తక్షణ సేవలు అందించడంలో మరింత శ్రద్ధ పెట్టాలి

పిర్యాదులు వచ్చినప్పుడు వాటిని సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి అని సూచించారు.
సీఐ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిస్థితిని కూడా సమీక్షించి, స్థానిక ప్రజల సమస్యలు, రాత్రి పహారాల విధానం, క్రైమ్ ప్రివెన్షన్ చర్యలపై సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు.
ప్రకాశం జిల్లా పోలీసులు పనితీరును మరింత అభివృద్ధి చేయడానికి ఇలాంటి పర్యవేక్షణలు కొనసాగనున్నట్లు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *