తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని మార్కాపురం జిల్లా రైతు సంఘం నాయకులు పిల్లి తిప్పారెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యావర్గ సభ్యులు పీసీ కేశరావు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలో భాగంగా బుధవారం సాయంత్రం కనిగిరి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు, ప్రధాన సెంటర్లు వద్ద నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ నూతన లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు నష్టం కలుగుతుందని, హక్కులను కోల్పోతారని, శ్రమ పెరుగుతుందని అన్నారు. పోరాటాల ద్వారా సాధించుకున్న పాత లేబర్ కోట్స్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనం రూ 25000 అమలు చేయాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కేంద్రం కార్మికులకు నష్టం కలిగించేలా కోడ్స్ ను అమలు చేసేందుకు రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు సహకారం అందించడం దుర్మార్గమన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు అవిశ్రాంతంగా పోరాటం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ కనిగిరి మండల కన్వీనర్ పి నరేంద్ర నాయకులు చెన్నకేశవులు, బ్రహ్మయ్య,అడివయ్య,మార్క్, కొండమ్మ, మాదవి, చెన్నమ్మ, అచ్చమ్మ,సీత,ప్రసాద్, ఆదిలక్ష్మి, రత్తమ్మ, ధర్మయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు