తొలి శుభోదయం కందుకూరు :-
కందుకూరు సర్కిల్లోని కందుకూరు పట్టణం కందుకూరు రూరల్ మరియు ఉలవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు తెలియజేయడం ఏమనగా పేకాట మరియు కోడి పందాలు నిర్వహించడం, ఆడటం నేరం. కావున ఎవరైనా కూడా పేకాట మరియు కోడిపందాలు నిర్వహించిన లేదా ఆడిన వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట మరియు కోడిపందాలు పై నిఘా ఉంచుటకు గాను ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడమైనది మరియు నిరంతరంగా డ్రోన్ కెమెరాతో పహారా ఏర్పాటు చేయడమైనది. గతంలో పేకాట మరియు కోడిపందాలు కేసులలో పట్టుబడిన వ్యక్తులపై నిఘా ఏర్పాటు చేయడమైనది మరియు వారందరినీ బైండోవర్ చేసుకోవడం జరుగుతుంది.