తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:-

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో శ్రీ కోదండ రామస్వామి వారి శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా స్వామివారి రథోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకలో కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్ నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మాట్లాడుతూ, శ్రీ కోదండ రామస్వామి వారి ఆశీస్సులతో కోవూరు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. భక్తులతో కలిసి రథాన్ని లాగుతూ ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పంచుకున్నారు. రథోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారికి దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమం గ్రామ ప్రజల ఐక్యతకు, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిందని ఆమె తెలిపారు. ఈ వేడుకలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *