తొలి శుభోదయం ప్రకాశం:-

ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయం 20వేల ఇవ్వాలని ,భూ యజమాని సంతకం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు ,పంట రుణాలు ఇవ్వాలని కోరుతూ మంత్రి స్వామి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వి. బాలకోటయ్య మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ రంగంలో 2 లక్షలు మందికౌలు రైతులు పంటలు పండిస్తున్నారు, భూ యజమానులకు ముందే కౌలు చెల్లించి , పెట్టుబడులకు కూడా కౌలు రైతులే డబ్బులు సమకూర్చుకుంటున్నారు .కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి కౌలుదారుడికి 20 వేల రూపాయలు పెట్టుబడి సాయం చేస్తానని ఎన్నికలకు ముందు వాగ్దానం చేసింది. అధికారంలోకి వచ్చాక 2024లో అమలు చేయలేదు,2025లో భూ యజమానులకు రెండు సార్లు 14 వేల రూపాయల సహాయం అందించారు కానీ వాస్తవ సాగులో ఉన్న భూమిలేని కౌలు రైతులకు మాత్రం పెట్టుబడి సాయం ఇవ్వలేదు. జిల్లాలో ఇప్పటికీ 45వేలు కౌ లు గుర్తింపు కార్డులు ఇచ్చారు. కానీ ఒక్కరికి కూడా పెట్టుబడి సాయం అందలేదు . గత ప్రభుత్వం ఎస్సీ కౌలు రైతులకు మాత్రమే సాయం అందించిందని, మేము అధికారంలోకి వస్తే ఓసీలకు, బీసీలకు ,ఎస్సీలకు అందరికీ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం కౌలు రైతులని మోసం చేయటమేఖరీఫ్ సీజన్ దాటి రబీ సీజన్ ప్రారంభమై రెండు నెలలు అవుతుంది ,కానీ ఎటువంటి సాయం లేదు .ఈ క్రాప్ లో నమోదైన కౌలు రైతులకు, భూమి లేకుండా కౌలు వ్యవసాయం చేస్తున్న కౌలు గుర్తింపు కార్డు పొందిన వారికి ,గుర్తింపు కార్డు పొందకపోయినా వాస్తవ సాగుదారులకు కూడా పెట్టుబడి సాయం వెంటనే అందించాలని కోరుతున్నాము. పాత చట్టం మారుస్తామని ఎన్నికలకు ముందు హామీఇచ్చారు ,వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు వ్యవసాయ బడ్జెట్ పుస్తకంలో లిఖితపూర్వకంగా రాశారు, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ముసాయిదా తయారుచేసి అభిప్రాయాలు అడిగారు ,కానీ ఇంతవరకు కొత్త చట్టం చేయకపోవడం కౌలు రైతుల ఎడల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుంది .కాబట్టే చట్టాన్ని వెంటనే మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం .ప్రతి కౌలు రైతుకు ఆర్బిఐ నిబంధనల ప్రకారం రెండు లక్షల వరకు హామీలేని పంట రుణాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మంత్రి గారిని కోరడం జరిగింది.ఈ కార్యక్రమం లో జి. సాల్మన్, వి. మోజెస్, కె. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *