తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

బింగినపల్లి గ్రామ రైతుసోదరులందరికి మన గ్రామం లో ఖరీఫ్ సీజన్లో పెట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రం మార్చ్ నెల 29 వ తారీకు తో ముగిసింది రైతులకు వారి అకౌంట్ ల లో నగదు జమ కావడం జరిగినది 4రోజులు వ్యవధి లో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికి బింగినపల్లి వుళ్లపాలెం, సోమరాజుపల్లి
పెదపల్లెపాలెం రైతులు అవకాశం ఉపయెగించుకున్నారు సుమారు 2200 బస్తాలు Tobacco గ్రోయర్స్ ద్వారా రైస్ మిల్లులకు పంపడం జరిగింది.దళారీ వ్యవస్థ కు అందకుండా నేరుగా రైతు తాను పండించిన ధన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేవిదంగా అవకాశం కలిపించిన రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ డోల శ్రీ బాలవీరంజనేయస్వామి కి మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్యగారికి కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు Tobacco గ్రోయర్స్ MD N సురేంద్రబాబు గారూ EX MD G హరినాథ్ బాబు గారూ వ్యవసాయ శాఖ అధికారి టి పూర్ణచంద్రరావు గారూ VAA CH శారద గారికి బింగినపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఆయా గ్రామాలు రైతులు ధన్యవాదములు తెలియజేసారు.మరియు మరో రెండు రోజుల్లో రబీ సీజన్ కి సంబందించిన మరల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభము కానున్నది. ఈ అవకాశాన్ని రైతులు ఉపయెగించుకోవాలని కోరడమైనది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *