ఒంగోలు రైల్వే స్టేషన్ మరియు రైళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు
రైలులో సుమారు 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ప్రకాశం జిల్లా పోలీస్ లు
తొలి శుభోదయం:-
గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, IPS గారి ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పార్టీ, ఈగల్ టీం, సిబ్బంది మరియు జాకీ జాగిలంతో కలిసి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ కేంద్రాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన పార్సిళ్లు, ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులు మరియు ఇతర వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు.ఈ తనిఖీలలో రైలు నంబర్ 18189 ఎర్నాకుళం జంక్షన్ ఎక్స్‌ప్రెస్‌లో జిల్లా పోలీసులు ఒంగోలు నుండి కావలి వరకు తనిఖీలు నిర్వహించి సుమారు 14 కిలోల గంజాయి స్వాధీనం చేశారు. ఇద్దరు అనుమానితులు 1. ఆనంద్ రాణా, S/o జగన్నాథ్ రాణా (47 సం), బెలీసర్దా నివాసి, బలంగీర్ జిల్లా, ఒడిశా రాష్ట్రం, 2) మిలు మాతాలి, S/o అగస్తి మాతాలి (25 సం), ఖలియముండా నివాసి, బౌధ్ జిల్లా, ఒడిశా రాష్ట్రం అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు కోసం జి.ఆర్.పి. పోలీసులకు అప్పగించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసే, విక్రయించే, వినియోగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. గంజాయి మరియు మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266 కు తెలియజేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలియజేశారు.ఈ తనిఖీలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్, ఎస్సైలు శివ రామయ్య, చెంచయ్య, జి.ఆర్.పి ఎస్సై మధుసూధనరావు,ఈగల్ టీం,స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.