తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా పోలీసులు, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గాంధీ పార్క్ ప్రాంతంలో విస్తృత స్థాయి ఆకస్మిక తనిఖీలు (Surprise Checking) నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వన్ టౌన్ పోలీస్ సిబ్బంది మరియు BD టీమ్ పాల్గొని పార్క్ పరిసరాల్లో రాకపోకలు, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల ధృవీకరణ, శాంతి భద్రత అంశాలు వంటి కీలక విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ప్రజలు ఎక్కువగా చేరుకునే గాంధీ పార్క్ ప్రాంతంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేయడమే ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశ్యం.సీఐ నాగరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ—
పార్క్ ప్రాంతం ప్రజల కోసం సురక్షిత వాతావరణంగా ఉండేందుకు పోలీసులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని,
అవకతవకలు, అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తించబడితే తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని,
ప్రజలు భద్రతా చర్యల్లో భాగస్వాములు కావాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.ప్రకాశం జిల్లా పోలీసులు శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా ఇలాంటి Surprise Checking కార్యక్రమాలను నిరంతరం కొనసాగించనున్నట్లు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *