ప్రజల నుండి అర్జీలు స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తుముల
తొలి శుభోదయం:-
గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరుశాసనసభ్యులుముత్తుముల అశోక్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో తెలియచేయగా వాటిని పరిశీలించిన ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను పరిష్కారంచేసేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. ప్రజలుతమకుఎటువంటిసమస్యలు ఉన్న టీడీపీ కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్ తనకు తెలియచేయవచ్చునని ఎమ్మెల్యే తెలిపారు..