తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, ప్రజల భద్రత, నేరాల నివారణ, రైల్వే స్టేషన్లలో సెక్యూరిటీ మజ్బూత్ చేయడం లక్ష్యంగా గిద్దలూరు రైల్వే స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృతంగా చెకింగ్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బాంబ్ డిటెక్షన్ (BD) టీమ్ మరియు డాగ్ స్క్వాడ్‌ పాల్గొని, స్టేషన్ ప్రాంగణం, వెయిటింగ్ హాల్స్, ప్లాట్‌ఫార్మ్‌లు, అండర్‌పాసులు, లగేజ్ రూమ్స్, అనుమానాస్పద ప్రాంతాలు, పార్సిల్ కార్యాలయాల్లో సమగ్ర తనిఖీలు చేపట్టారు.ప్రయాణికుల లగేజ్‌ను స్నిఫర్ డాగ్స్ సాయంతో పరిశీలించారు.అనుమానాస్పద వస్తువులు, ల LEFT-OVER baggage, నిర్లక్ష్యంగా ఉంచిన వస్తువులపై ప్రత్యేక పరిశీలన చేశారు. స్టేషన్‌లో కదలికలను పర్యవేక్షిస్తూ, భద్రతా ప్రమాణాలను పెంపొందించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ:ప్రజల భద్రత కోసం ఇలాంటి చెకింగ్‌లు తరచుగా కొనసాగుతాయని ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించిన వెంటనే పోలీసులను సమాచారం ఇవ్వాలని పౌరుల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యమవుతుందని తెలిపారు.ప్రకాశం పోలీస్ ప్రజల భద్రత, శాంతి భద్రతల కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *