తొలి శుభోదయం న్యూస్ గూడూరు:-
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం వీఆర్వోల సంఘం అధ్యక్ష పదవికి వగ్గాల రాధాకృష్ణ రాజీనామా చేశారు. వీఆర్వోల సమస్యలు సకాలంలో పరిష్కరించలేకపోయినందున రాజీనామా చేసినట్లు ప్రకటించిన వీఆర్వోల సంఘం గూడూరు మండల అధ్యక్షులు వగ్గాల రాధాకృష్ణ.గూడూరుగ్రామ రెవిన్యూ అధికారి రాధకృష్ణ మాట్లాడుతూ,గూడూరు మండలం లోని వీఆర్వోల సమస్యలుపరిష్కారం కోసం, వారి సంక్షేమ అవసరాలకోసం నన్ను గూడూరు మండలఅధ్యక్షులు గా ఎన్నుకున్నారు అని, కానీ నేను ఆ సమస్యలు పరిష్కరించడం లో విఫలం అయ్యాను కాబట్టి నేను గూడూరు మండల గ్రామ రెవిన్యూఅధికారుల అసోసియేషన్ అధ్యక్షులుగా స్వచ్చందంగా పదవి నుండి తప్పుకుంటున్నాను అని, ఇంక వేరే ఎవరిని అయినా అధ్యక్షులు గా నియమించుకునుటకు నాకు ఎటువంటి అబ్యంతరం లేదు అని ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు.