తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పక్కా గృహాల మంజూరుకు లబ్ధిదారుల వివరాలను PMAY–Awaas Plus మొబైల్ యాప్ ద్వారా తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం లబ్ధిదారులు తమ వ్యక్తిగత వివరాలు మరియు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి.ఈ నమోదు ప్రక్రియలో భాగంగా జాబ్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్బుక్ వంటి పత్రాలు అవసరం. లబ్ధిదారులు తమ సచివాలయంలోని ఇంజనీరింగ్ అసిస్టెంట్ లేదా మండలంలోని అసిస్టెంట్ ఇంజనీర్ ను సంప్రదించాలి. అధికారులు లబ్ధిదారుల గృహాల వద్దకే వెళ్లి Face Authentication ద్వారా వివరాలను PMAY–Awaas Plus యాప్లో నమోదు చేస్తారు.
నమోదు ప్రక్రియ 30 నవంబర్ 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కావున స్థలం ఉన్నా – స్థలం లేకపోయినా, రాబోయే కాలంలో పక్కా గృహాలు పొందాలనుకునే ప్రతీ అర్హ కుటుంబం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సి ఉంది. భవిష్యత్తులో స్థలం మంజూరు అయిన వెంటనే గృహం ఇవ్వబడేందుకు యాప్లో ముందస్తు నమోదు అవసరం.రాబోయే ఐదు సంవత్సరాలలో పక్కా గృహాలు పొందాలనుకునే ప్రతి అర్హ కుటుంబం తప్పనిసరిగా ఈ ప్రక్రియలో పాల్గొనాలని, ఆలస్యము చేయకుండా నమోదు పూర్తిచేయాలని మంత్రి నాయుడుపాలెం కార్యాలయం సూచించింది.