తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, ములగుంటపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో శ్రద్ధగా నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మండల అభివృద్ధి అధికారి జయమణి హాజరై, పూలే చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహాత్మా పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని, ముఖ్యంగా మహిళా విద్య మరియు సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.కార్యక్రమంలో ఎంఈఓ కత్తి శ్రీనివాసరావు, తహసీల్దార్ రాజేష్, డిప్యూటీ తాసిల్దార్ ప్రసాద్ , ఏ ఎస్ ఓ శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు, అంబటి బ్రహ్మయ్య, ఆర్ ఐ,వీఆర్‌వోలు మరియు స్వర్ణ సచివాలయ సిబ్బంది, వి ఓ ఏ లు పాల్గొని మహాత్మా పూలే చిత్రపటానికి నివాళులర్పించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *