తొలి శుభోదయం సింగరాయకొండ:-
సోమరాజుపల్లి ఆదర్శ ప్రాధమిక పాఠశాలలొ సంక్రాంతి ముందస్తు సంబరాలు ఘనంగా జరిగాయి. పిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి బహుమతులు అందచేయడం జరిగింది. భోగి మంటలు వేసి నృత్యాలు చేయడం జరిగింది. పతంగులు ఎగరవేయడం జరిగింది. ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు శీలం ప్రసాదరావు, నరసింహారావు, లలితకుమారి మరియు రాదేశ్యామ్ పాల్గొన్నారు.