తొలి శుభోదయం కందుకూరు:-

ఒంగోలులో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళల పండుగ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. గౌరవ మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, ఇతర నేతలతో కలిసి ఆయన వేదికపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరావు గారు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల చెరగని జ్ఞాపకం అని, తెలుగుజాతి ఉనికిలో ఉన్నంతవరకు ఆ మహానుభావుడిని మరిచిపోదన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి పేరు మీద కళాపరిషత్ స్థాపించి, ప్రతి ఏటా ఆయన వర్ధంతి సందర్భంగా నాటక పోటీలు నిర్వహించటం గొప్ప విషయమన్నారు. 27 ఏళ్లుగా ఈ కళల పండుగను నిర్వహిస్తున్న మాజీ శాసనసభ్యులు ఈదర హరిబాబు గారిని ఎమ్మెల్యే గారు పొగడ్తలతో ముంచెత్తారు. ఒంగోలులోని తురకపాలెం ప్రాంత మహిళలు, చిన్నారులు ప్రదర్శించిన కోలాటాన్ని అతిథులు తిలకించి మెచ్చుకున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *