తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా చిమకుర్తి పట్టణ పరిధిలోని క్రైస్తవపాలెం ప్రాంతంలో అక్రమంగా జూదం ఆడుతున్న వారిని చిమకుర్తి సీఐ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో జూదం ఆడుతున్న 11 మందిని పట్టుకుని, వారి వద్ద నుండి రూ.3,060/- నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి, తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.జూదం వంటి అక్రమ కార్యకలాపాలు సామాజిక శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయని, ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని చిమకుర్తి సీఐ హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని ఆయన తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *