ఎవరైనా నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై చట్ట పరమైన చర్యలు
తొలి శుభోదయం ప్రకాశం:-
శాంతి భద్రతలకు, శాంతియుత వాతావరణానికి విఘాతం కలిగించేలా అల్లర్లు, గొడవలను ప్రేరేపితం చేసి అశాంతిని సృష్టిస్తే ఉపేక్షించేది లేదు శాంతియుత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు పలు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్నా చెడు నడత కలిగిన వ్యక్తులు/పాత నేరస్థులు, షీటర్లకు(రౌడీ షీటర్స్) కౌన్సెలింగ్ నిర్వహించారు.పోలీస్ అధికారులు షీటర్ల యొక్క జీవనాధారం మరియు ఇతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన యెడల చట్టాన్ని అతిక్రమించి దౌర్జన్యాలు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. మహిళ/ పిల్లలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ఒక వ్యక్తి మీద షీట్ ఉన్నప్పుడు దాని ప్రభావం తనపై, కుటుంబపై కూడా ఉంటుందని, ఈ చెడునడత కలిగిన ఇమేజ్ నుండి బయటపడాలని, సత్ప్రవర్తన ఒక్కటే మార్గమని, అందరితో కలసిపోయి మంచిగా జీవనం సాగించాలన్నారు. షీటర్లు (రౌడీ షీటర్స్) వ్యవహార శైలి మార్చుకోకపోయినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన, చట్టాన్ని అతిక్రమించి దౌర్జన్యాలు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించి కౌన్సిలింగ్ నిర్వహించినారు.