తొలి శుభోదయం ప్రకాశం:-
నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో ఉన్న చెడు నడత కలిగిన వ్యక్తులు, పాత నేరస్థులు మరియు షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో పోలీసులు, షీటర్ల జీవనాధారం మరియు కుటుంబ నేపథ్యంపై వివరణాత్మకంగా తెలుసుకున్నారు. తదుపరి ఏవైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన యెడల లేదా దౌర్జన్యాలకు తెగబడిన సందర్బంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. “ఎవరైనా నేరాలకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం”
“శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అల్లర్లు, గొడవలను ప్రేరేపించి అశాంతిని సృష్టించే వారిని అస్సలు ఉపేక్షించేది లేదు” అని అధికారులు స్పష్టంచేశారు.ఒక వ్యక్తి మీద షీట్ ఉన్నప్పుడు దాని ప్రభావం అతని వ్యక్తిగత జీవితం, కుటుంబం మరియు భవిష్యత్తుపై తీవ్రంగా పడుతుందనీ, చెడు నడత ఇమేజ్ నుండి బయటపడటానికి సత్ప్రవర్తనే ఏకైక మార్గమని సూచించారు. సమాజంతో కలిసిపోగలిగి, మంచి జీవనశైలిని అలవరుచుకోవాలని వారికి సూచనలు ఇచ్చారు.అసాంఘిక కార్యకలాపాలకు, గ్యాంగ్ చేష్టలకు లేదా చట్టాన్ని అతిక్రమించే వ్యవహారాలకు పాల్పడితే తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమం శాంతి భద్రతలను బలోపేతం చేయడంలో భాగమని తెలిపారు.