తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా జరుగుమల్లి పోలీసులు అక్రమ పేకాట శిబిరాలపై దాడి చేసి 16 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మొత్తం రూ.61,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు.జరుగుమల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తూమాడు గ్రామంలో పేకాట శిబిరం జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు. అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకుని, పేకాటకు ఉపయోగించిన నగదును, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు:
జూదం, పేకాట వంటి అక్రమ కార్యకలాపాలు వ్యక్తిగతంగా మరియు సామాజికంగా ప్రమాదకరమని, ఇలాంటి వాటిలో పాల్గొనకుండా చట్టాన్ని గౌరవించాలని సూచించారు.ప్రకాశం పోలీసులు నేర నియంత్రణ, ప్రజల భద్రత కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నారు.