తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా పోలీసులు, రహదారి భద్రతను కాపాడటం, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం లక్ష్యంగా NH–16 రహదారి పనులు జరుగుతున్న గ్రోత్ సెంటర్ ప్రాంతంలో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను క్రమబద్ధంగా మళ్లిస్తూ, రోడ్డు పనుల సమయంలో ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలపై సూచనలు ఇచ్చి, వేగ నియంత్రణ పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని పోలీసులు అవగాహన కల్పించారు. రహదారి పనులు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కొనసాగుతాయని, ప్రజలు పోలీసులకు సహకరించి, సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు