తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ .వి .హర్షవర్ధన్ రాజు,ఐపీఎస్. ఆదేశాల మేరకు ,జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించే చర్యల్లో భాగంగా, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు జాతీయ రహదారి అథారిటీ PD , సింగరాయకొండ సీఐ , మద్దిపాడు ఎస్‌ఐ , తాలూకా ఎస్‌ఐ కలిసి నిఘా చర్యల కోసము హైవేలోని పలు ప్రమాదకర ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్లు, రహదారి పరిస్థితులు, రాత్రి వెలుతురు, ట్రాఫిక్ సిగ్నేజీలు, మరియు రహదారిపై జరుగుతున్న వాహన రద్దీపై అధికారులు సమగ్రంగా పరిశీలించారు. అవసరమైన మరమ్మతులు, భద్రతా మార్పులు, మరియు రోడ్డు వినియోగదారుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇచ్చారు.జిల్లాలో ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసు శాఖ మరియు NHAI కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రజలు హైవేపై ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు.