తొలి శుభోదయం ప్రకాశం:-
అక్టోబర్ 8 నుండి 16 వరకు జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లో జరిగిన 10వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ 2025–26 (Pencak Silat Martial Arts) పోటీలలో, ప్రకాశం జిల్లా పోలీసు శాఖకు చెందిన పుల్లలచెరువు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న డి.ఎన్.బి. రత్నబాబు @ గోపి (PC-2609) గారు Pencak Silat 80–85 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కానిస్టేబుల్ డి.ఎన్.బి. రత్నబాబును జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఒకవైపు పోలీసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ, మరోవైపు క్రీడలపై ఆసక్తితో నిరంతర సాధన చేస్తూ జాతీయ స్థాయిలో పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. ప్రకాశం జిల్లా పోలీసు శాఖకు చెందిన సిబ్బంది జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్‌లో కూడా మరిన్ని విజయాలు సాధించాలని ప్రోత్సహించారు.