తొలి శుభోదయం:-
ఆగస్టు 8 నుంచి 11, 2025 వరకు డెహ్రాడూన్‌లో నిర్వహించిన అక్రోబాటిక్స్ & ట్రాంపోలిన్ జిమ్నాస్టిక్స్ జాతీయ ఛాంపియన్‌షిప్‌లో మన రాష్ట్ర జిమ్నాస్టిక్స్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి 7 రజత పతకాలు మరియు 3 కాంస్య పతకాలు సాధించిన సందర్భంగా ఈ రోజు శాప్ చైర్మన్ గారిని విజయవాడ లో వారి కార్యాలయంలో కలవడం జరిగింది.ఈ విజయాన్ని పురస్కరించుకొని, శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు గారు క్రీడాకారులను అభినందించి, సత్కరించారు. ఆ తర్వాత శాప్ చైర్మన్ గారు మాట్లాడుతూ, క్రీడాకారుల కృషిని ప్రశంసిస్తూ, వారు భవిష్యత్తులో మరిన్ని జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ప్రభుత్వం తరపున వారికి రావలసిన క్రీడా ప్రోత్సాహాలు అందిస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జిమ్నాస్టిక్ అసోసియేషన్ సభ్యులు, క్రీడా శిక్షకులు మరియు గుంటూరు డిఎస్డిఓ అఫ్రోజ్ ఖాన్ పాల్గొన్నారు.