తొలి శుభోదయం న్యూస్ వలేటివారిపాలెం:-
జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు వలేటివారిపాలెం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజల గ్రీవెన్స్ అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.అభివృద్ధి పనులు, భూసేకరణ, ఉపాధి హామీ పనులు, మరియు జలధార-జలహారతి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం అసలు సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.