తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-

పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు అందరూ కలసి ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు.
పాఠశాల ఆడిటోరియంలో ఉదయం 10:30 కు ఈ కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ సభకు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సోపర్ల ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ సైకం చంద్రశేఖర్ డివిఎస్ ప్రసాద్ పాకల గ్రామ విద్యాభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాఠశాల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బి హరిబాబు డివిఎస్ ప్రసాద్ ఉపాధ్యాయ వృత్తిలో చేరిన ప్రారంభం నుంచి తనకు తెలుసునని,తాము జన విజ్ఞాన వేదిక, అక్షర ప్రకాశం వంటి కార్యక్రమాల్లో కలిసి పనిచేసామని, డివీఎస్ ప్రసాద్ ఏ పని అయినా ఎంతో నిబద్ధతతో నిర్వహించేవాడని, డీవీఎస్ ప్రసాద్ లాంటి ఉపాధ్యాయులు సమాజానికి ఎంతో అవసరమని తెలియజేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ప్రసాద్ తన ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు గోళ్ళమూడి అశోక్, శ్రీనివాసులు, గ్రామ ఉపసర్పంచ్ బల్లెల ప్రభాకర్ రెడ్డి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఆర్, వెంకటేశ్వర్లు, షేక్ అబ్దుల్ రెహమాన్ విశ్రాంత ఎంఈఓ నారాయణరావు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బండి నరసింహారావు, ఊళ్ళ పాలెం ప్రధానోపాధ్యాయుడు డీఎస్కేవి ప్రసాద్, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని మహాలక్ష్మి, పాత సింగరాయకొండ ప్రధాన ఉపాధ్యాయిని పద్మజ, నేరేడుపల్లి ప్రధానోపాధ్యాయులు సూరా శ్యాంప్రసాద్, వీరభద్రపురం ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ రెడ్డి, చీమకుర్తి ఎంఈఓ కే. శివాజి, కందుకూరు బాయ్స్ స్కూల్ ఇంగ్లీష్ అసిస్టెంట్ మాధవరెడ్డి ,శీలం వెంకట్రావు, ఏవి రావు, పాకల వెంకటేశ్వర్లు, వలేటివారిపాలెం ఎంఈఓ మల్లికార్జున నూకసాని వెంకటేశ్వర్లు అర్రి బోయిన బోయిన రాంబాబుమొదలగువారు తమ ప్రసంగాలలో డీవీఎస్ ప్రసాద్ గుణగణాలను ఉద్యోగ నిర్వహణలో వారి అంకిత భావాన్ని ఎంతగానో ప్రశంసించారు.డీవీఎస్ ప్రసాద్ కుమారుడు అరవింద్ ప్రసంగిస్తూ తండ్రి తనకు ఏ విధంగా ఇన్స్పిరేషన్ అయ్యారో తెలియజేశారు. అనంతరం డివిఎస్ ప్రసాద్ ఝాన్సీ రాణి దంపతులు ఇరువురిని సభా వేదిక పైకి ఆహ్వానించినారు. ముందుగా
డీ వీఎస్ ప్రసాద్ తమ స్పందనను తెలియ జేస్తూ తనకు ఇంత చక్కగా సత్కారం ఏర్పాటు చేసిన పాఠశాల సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ తల్లి తండ్రి గురువు దైవం అనే మాటలను అర్థం చేసుకొని క్రమశిక్షణతో మెలిగినప్పుడు వారి జీవితం అభివృద్ధి పదం లోకి వెళుతుందని తెలియజేశారు.అనంతరం పి తిరుమలరావు రచించిన పంచ పద్య రత్నమాలిక ను డి . విజయానంద్ గానం చేశారు. అనంతరం మొదట పాఠశాల సిబ్బంది వారికి ఘనంగా సత్కారం చేశారు. పాఠశాల సిబ్బంది అందరూ కలిసి వారికి సన్మాన మహోత్సవ పత్రమును అందజేశారు.అనంతరం విచ్చేసిన అతిధులు ,వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సింగరాయకొండ ఎంఈఓ కత్తి శ్రీనివాసరావు, ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు డివిఎస్ ప్రసాదు దంపతులను దుశ్శాలువలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం
డివిఎస్ ప్రసాద్ పాఠశాల విద్యార్థులకు, విచ్చేసిన అతిధులకు విందు భోజనం ఏర్పాటు చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *