నమోదైన కేసుల వివరాలు, ప్రస్తుత స్థితిగతులపై సమగ్రంగా ఆరా తీసి, పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఐజి
చెడునడతగల వ్యక్తులపై నిత్యం నిఘా ఉంచాలి…..దౌర్జన్యాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలి
జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, శాంతి భద్రతల సమస్యలు చోటు చేసుకోకుండా పటిష్ట నిఘా ఉంచాలి.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఇంకా మెరుగైన చర్యలు చేపట్టాలి
తొలి శుభోదయం ప్రకాశం:-
నేరాలు నియంత్రణ,లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, కీలక కేసుల పురోగతి, గంజాయి రవాణా/విక్రయం నియంత్రణ, క్రైమ్ మేనేజ్‌మెంట్ వంటి పలు అంశాలపై గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాఠి, IPS , జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, IPS తో కలిసి పోలీసు అధికారులతో సింగరాయకొండ పోలీస్ సర్కిల్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో నమోదైన కేసుల వివరాలను ఐజీ సమీక్షించి, వాటి ప్రస్తుత స్థితిగతులపై సమగ్రంగా ఆరాతీశారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంతాల్లో పెట్రోలింగ్, గస్తీ నిర్వహణను మరింత బలోపేతం చేసి నేరాల నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.నేర దర్యాప్తుల్లో వృత్తి నైపుణ్యం మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముద్దాయిలను గుర్తించి అరెస్ట్ చేయాలన్నారు. ప్రజా భద్రతను అత్యంత ప్రాధాన్యతగా భావించి, కేసులు తగ్గించుటకు మరింత చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కీలక కేసుల విచారణను వేగవంతం చేసి, నిందితులకు చట్టపరమైన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పట్టణాలు, గ్రామాల్లో శాంతి భద్రతల కోసం నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.జిల్లాలో గంజాయి రవాణా, సరఫరా, నిల్వను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఐజీ గారు తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టి, పాత నేరస్థులు–రిపీటెడ్ అఫెండర్లపై నిఘా ఉంచి, పెట్టి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, స్పీడ్ చెకింగ్, వాహన తనిఖీలు, బారికేడ్లు, రిఫ్లెక్టివ్ డ్రమ్ములు ఏర్పాటు చేయాలని, డ్రంకన్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని ఐజీ ఆదేశించారు.పోలీస్ స్టేషన్‌ను సందర్శించే బాధితులకు ధైర్యం, నమ్మకాన్ని కల్పించే విధంగా ప్రతి కేసును పోలీస్ అధికారులు, సిబ్బంది సున్నితంగా వ్యవహరించాలని ఐజీ సూచించారు. ఈ సమావేశంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సిఐలు హాజరత్తయ్య, నాగరాజు, రామారావు, ప్రసాద్, రాజేష్ కుమార్ మరియు ఎస్సైలు పాల్గొన్నారు.
