తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఇంచార్జి ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ అధికారులు శ్రీ సత్య సాయి బాబా గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం శ్రీ సత్య సాయి బాబా గారి యొక్క చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, శ్రీ సత్యసాయి బాబా గారు సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస వంటి మానవ ధర్మాలను బోధించారని పేర్కొన్నారు. సత్య సాయి బాబా సేవా సమితి ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు, విద్య, తాగునీటి ప్రాజెక్టులు మరియు పలు సేవా కార్యక్రమాలు అందించడం విశేషమన్నారు. బాబా చూపించిన సేవామార్గం అందరికీ అనుసరణీయమని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పిసిఆర్ సిఐ దుర్గాప్రసాద్, అర్ఐ లు రమణారెడ్డి, సీతారామరెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *