తొలి శుభోదయం ప్రకాశం:-

నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని శనివారం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణాన్ని, వివిధ విభాగాల నిర్వహణకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను ఎస్పీ గారు పరిశీలించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో డిసిఆర్బీ, స్పెషల్ బ్రాంచ్, ఐటి కోర్, డిపిఓ తదితర కీలక విభాగాలను ఏర్పాటు చేయుటకు అనువైన పలు ప్రదేశాలను జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు.అదేవిధంగా పోలీస్ కార్యాలయానికి అనుబంధంగా ఉన్న క్వార్టర్స్ చుట్టూ ఉన్న ప్రాంతాలను పరిశీలించి, అక్కడ మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పరిశుభ్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్ సిబ్బందికి అవసరమైన వసతులను మెరుగుపరచాలని, కార్యాలయాల్లో సమర్థవంతమైన నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.జిల్లా ఎస్పీ వెంట మార్కాపురం డిఎస్పి యు నాగరాజు,ఎఅర్ డిఎస్పీ కె. శ్రీనివాసరావు, ఎస్బి ఇన్స్పెక్టర్ యం. శ్రీనివాసరావు, మార్కాపురం సిఐ యం. సుబ్బారావు, మార్కాపురం టౌన్ ఎస్ఐలు సైదులు బాబు మార్కాపురం రూరల్ ఎస్ఐ అంకమ్మరావు, పెద్దారవీడు ఎస్సై సాంబశివయ్య మరియు సిబ్బంది ఉన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *