చిత్తూరు, అక్టోబర్ 29
ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను పునరుద్ధరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను డిఅర్ఓ కె. మోహన్ కుమార్, ఆర్డిఓ, శ్రీనివాసులు , కలెక్టరేట్ ఏఓ వాసుదేవన్ లతో కలసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సచివాలయంలో ఉద్యోగుల తమ విధులు నిర్వర్తించడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో భాగంగా గతంలో ఉన్న వీడియో కాన్ఫరెన్స్ ను జేసి జి.విద్యాధరి మరియు డిఆర్ఓ ల ఆధ్వర్యంలో పునరుద్ధరించి వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కార్పొరేట్ తరహాలో పరిశుభ్రత, పచ్చదనం పెంపు, మౌలిక వసతుల కల్పన, రికార్డుల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రికార్డు లు సమర్థవంతంగా నిర్వహిస్తే సమస్యల పరిష్కారం సులభం అవుతుందన్నారు. నూతన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను అవసరమైన అన్ని ప్రభుత్వ శాఖలు వినియోగించుకోవచ్చునన్నారు. డిఆర్ఓ మోహన్ కుమార్ మాట్లాడుతూ సమర్థవంతమైన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పని చేయడం అధికారులు, సిబ్బంది అదృష్టమని, నేను డిఆర్ఓ గా జిల్లా పదవీ భాద్యతలు స్వీకరించి ఒక సంవత్సరం పూర్తవుతున్నదని తెలిపారు. ప్రభుత్వ అధికారులు తమ అధికారిక కార్యకలాపాల నిర్వహణకు అనువుగా వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి గతంలో జిల్లాకు విశిష్ట సేవలందించిన ఎం.నాగార్జున, ఐఏఎస్ పేరుతో జిల్లా కలెక్టర్ నామకరణం చేశారన్నారు. జిల్లా కలెక్టర్ జిల్లాకు వచ్చిన అనంతరం తీసుకున్న నిర్ణయాల ద్వారా మార్పు మొదలైందని, త్వరలో జిల్లా అభివృద్ధి పథంలో పాయనిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. హాస్పిటల్ లు, పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని, 17 తహశీల్దార్ కార్యాలయాలలో అవసరమైన ఎం ఆర్ ఓ ఛాంబర్లు, మీటింగ్ హాల్ లు, ప్రజలు వేచి ఉండే గదులు, మరుగుదొడ్ల మరమ్మత్తులకు సహకరిస్తున్నారన్నారు. కలెక్టర్ సూచనలతో జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు కాంట్రాక్టర్ ల ద్వారా మాట్లాడి పనులు వేగవంతం చేశారన్నారు. కలెక్టరేట్లోని మూడు బ్లాక్ ల అధికారులు ఈ కాన్ఫరెన్స్ హాలను వినియోగించు కోవచ్చునని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి జిల్లా స్థాయి నుండి కింది స్థాయి వరకు సిబ్బంది అందరూ కలెక్టర్ కు సహకరిస్తారన్నారు. ఈ కార్యక్రమం లో చిత్తూరు ఎమ్మార్వో కుల శేఖరు, కలెక్టరేట్లోని వివిధ శాఖలకు సంబంధించిన సెక్షన్ సూపర్డెంట్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.