తొలి శుభోదయం టంగుటూరు:-

టంగుటూరు అంబేద్కర్ పార్క్ నందు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి “సతీమణి రమాబాయి 129 జయంతి కార్యక్రమం” అంబేద్కర్ యూత్ అసోసియేషన్ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అశోక్ బాబు మాట్లాడుతూ రమాబాయి గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు చదువుకోవటం కోసం పిడకలు అమ్మి , తినీకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, చివరకు తన నలుగురు బిడ్డలు చనిపోతున్న ఆ డబ్బులతో బిడ్డలను బతికించు కాకుండా, అంబేద్కర్ గారు చదువుకుంటే ఈ దేశంలోని దళిత బిడ్డలందరు బ్రతుకుతారని తన బిడ్డల్ని త్యాగం చేసి అంబేద్కర్ గారికి డబ్బులు పంపినటువంటి త్యాగశీలి రమాబాయి గారు, రామబాయి లేకపోతే ఇంత చదువు చదివి,ఇంత ఆత్మస్థైర్యంతో ఈ దేశ రాజ్యాంగ నిర్మించలేనని ఎన్నోసార్లు బాధపడ్డారని అశోక బాబు తెలిపారు, ఈ కార్యక్రమంలో దుగ్గిరాల పేరరాజు మాట్లాడుతూ రమాబాయినీ ఆదర్శంగా తీసుకొని అందరూ చదువుకోవాలని తెలిపారు, కార్యక్రమం లో తులిబిల్లి క్రాంతికుమార్, కసుకుర్తి రాజు, చల్లపల్లి కుమార్ మేడిది బాలకోటయ్య, నత్తల మాలకొండయ్య, మద్దిరాల బాలసుందరం, ఎర్రమల కృష్ణ, దేవరపల్లి రాము, దుగ్గిరాల రాము, మద్దిరాల సుమన్, మరియు యువకులు పెద్దలు పాల్గొని రమాబాయి కి నివాళులర్పించారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *