తొలి శుభోదయం ప్రకాశం:-
విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా రోడ్డు భద్రత ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు టంగుటూరు టోల్ ప్లాజా వద్ద రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సింగరాయకొండ సీఐ పర్యవేక్షించారు.వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు పాటించే అవసరం, హెల్మెట్ మరియు సీటు బెల్ట్ వినియోగం, వేగ పరిమితులు, డ్రంక్ & డ్రైవ్ ప్రమాదాలు వంటి ముఖ్య సూచనలు అందించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రతి వాహనదారుడు బాధ్యతతో డ్రైవింగ్ చేయాలని పోలీసులు సూచించారు.