తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో, సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ (DL) తప్పనిసరి, వాహన బీమా (Insurance) కలిగి ఉండటం, అలాగే అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు పోలీస్ స్టేషన్ నంబర్లు వాళ్ల ఆటోలలో ప్రదర్శించుకోవాల్సిన అవసరం వంటి ముఖ్య అంశాలపై అవగాహన కల్పించారు.డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రజల భద్రత కోసం జాగ్రత్తగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని అధికారులు సూచించారు. టంగుటూరు ప్రాంతంలో రోడ్డు ప్రమాదాల నివారణ, శాంతి భద్రతల పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *