తొలి శుభోదయం ప్రకాశం పోలీస్:-

ప్రకాశం జిల్లా పోలీసు శాఖలో శాసనబద్ధమైన, పారదర్శకమైన మరియు ప్రజాభద్రతకు మరింత భరోసా కల్పించే లక్ష్యంతో భాగంగా, ప్రకాశం జిల్లా పోలీసు అధికారులు టంగుటూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు.ఈ సందర్భంగా టంగుటూరు పి.ఎస్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారి విధి నిర్వహణ, బాధ్యతలు, ప్రజలకు అందిస్తున్న సేవలపై సమగ్రంగా చర్చించారు. స్టేషన్ పరిధిలో నమోదైన వివిధ కేసులకు సంబంధించిన సీ.డి ఫైళ్లు, కేసు రికార్డులు, స్టేషన్ డైరీలు, ఇతర ముఖ్యమైన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.పోలీసు విధుల్లో నిబద్ధత, క్రమశిక్షణ, వేగవంతమైన విచారణ, న్యాయసమ్మతమైన చర్యలు తప్పనిసరిగా ఉండాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలని సిబ్బందికి సూచనలు ఇచ్చారు.స్టేషన్ నిర్వహణ, రికార్డు సంరక్షణ, కేసుల పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, మరింత మెరుగైన పనితీరుతో ప్రజల విశ్వాసాన్ని పెంచేలా పని చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సీఐ , టంగుటూరు ఎస్ ఐ సంబంధిత పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.ప్రజల భద్రతే లక్ష్యంగా, పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఇలాంటి తనిఖీలు, సమీక్షలు నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసు శాఖ స్పష్టం చేసింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *