తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, టంగుటూరు ఎస్ఐ పర్యవేక్షణలో రాగయ్యకుంటలో అక్రమంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులపై పోలీసు బృందం అకస్మిక దాడి నిర్వహించింది. అక్కడి పరిసరాలను మలినపరిచిన వారికి పోలీసులు కఠినంగా హెచ్చరికలు జారీ చేసి, సమాజం పట్ల బాధ్యతను గుర్తుచేస్తూ వారు అస్వచ్ఛం చేసిన ప్రదేశాన్ని తమ చేతులతోనే శుభ్రం చేయించారు.టంగుటూరు పోలీసులు ప్రజా శాంతి భద్రతకు విఘాతం కలిగించే మద్యం దుర్వినియోగంపై నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటున్నారని, ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. అక్రమ మద్యం సేవించడం, ప్రజా ప్రదేశాలను కాలుష్యానికి గురి చేయడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.ప్రజలు సమాజ శ్రేయస్సు కోసం సహకరించాలని, అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులను సమాచారమివ్వాలని కోరారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *