భక్తుల కోర్కెలు తీర్చే మహిమ గల తల్లి వల్లూరమ్మ
ధర్మకర్తల మండలి ఆలయ అభివృద్దికి కృషి చేయాలి
వల్లూరమ్మ తల్లి కరుణ, ఆశీర్వాదంతో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
తొలి శుభోదయం ప్రకాశం:-
భక్తుల కోర్కెలు తీర్చే మహిమ గల తల్లి వల్లూరమ్మ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నాడు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరులో వల్లూరమ్మ తల్లి దేవాలయంలో జరిగిన ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….భక్తుల కోర్కెలు తీర్చే మహిమ గల తల్లి వల్లూరమ్మ, ఈ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల భక్తుల పూజలందుకుంటూ, ప్రజలను, పశుసంపదను వ్యాధిబాధల నుండి, దుష్టశక్తుల నుండి కాపాడే చల్లనితల్లిగా వల్లూరమ్మ తల్లి విరాజిల్లుతోంది. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వల్లూరమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. వల్లూరమ్మ తల్లి కరుణ, ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎల్లప్పుడు సుభిక్షంగా ఉండాలని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ సంధర్బంగా నూతనంగా ఎన్నికైన ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి…ధర్మకర్తల మండలి ఆలయ అభివృద్దికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
