తొలి శుభోదయం టంగుటూరు :-
టంగుటూరు గ్రామం మరియు మండలం పరిధిలోని దీపావళి ముందు గుండు సామాగ్రి అమ్మే వ్యాపారస్తులకు తెలియజేయునది ఏమనగా, రాబోయే దీపావళి సందర్భంగా ఎవరైనా దీపావళి మతాబులు అమ్మే వ్యాపారం తాత్కాలికంగా చేయాలని అనుకుంటే తప్పనిసరిగా “దీపావళి మతాబులు అమ్మే తాత్కాలిక లైసెన్స్ ని” తప్పనిసరిగా పొందవలెను. ఈ లైసెన్సు ఒంగోలు ఆర్డీవో గారు ఇస్తారు. ఈ పర్మిషన్ లేకుండా ఎవరైనా గానీ తాత్కాలికంగా అయినప్పటికీ దీపావళి మతాబులు అమ్మిన యెడల ఆ దీపావళి మతాబులను స్వాధీనం చేసుకుని వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలపడం అయినది.
ఎవరైనా తాత్కాలిక పర్మిషన్ లేకుండా ఈ దీపావళి మతాబులు అమ్మినా యెడల వారి సమాచారాన్ని ఈ క్రింది నెంబర్ కు తెలియజేయవలసిందిగా ప్రజలను కోరడమైనది.
SI టంగుటూరు 9121102137.
Ci సింగరాయకొండ
9121102135.