తొలి శుభోదయం కందుకూరు:-

టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) కందుకూరు నందు NCC యూనిట్ పునరుద్ధరించాలని కళాశాల ప్రిన్సిపాల్, ఎం. రవి కుమార్, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరావు, స్కంధపురి సేవా సమితి చైర్మన్ పువ్వాడి మౌనిక సహకారంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కళాశాలలో మియావాకి ఫారెస్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విన్నపం చేయడం జరిగింది. వెంటనే స్పందించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారంపార్లమెంట్ సమావేశాల సందర్భంగా, ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ శ్రీ రాజ్ నాథ్ సింగ్ ని కలిసి టీఆర్ఆర్ కళాశాలలో NCC Unit ను పునరుద్ధరించాలని కోరడం జరిగింది. రాజ్ నాథ్ సింగ్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. కళాశాలకు ఎన్సిసి యూనిట్ తప్పకుండా మంజూరు చేస్తామని ఎంపీ కి హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కళాశాల యొక్క సమస్యను పరిష్కరించడానికి వెంటనే చొరవ చూపించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఆ విషయాన్ని ఎంపీగా దృష్టికి బలంగా తీసుకువెళ్లిన ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కి, స్కంధపురి సేవా సమితి చైర్మన్ పువ్వాడి మౌనిక కు కళాశాల ప్రిన్సిపాల్ ఎం రవికుమార్ మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు. కళాశాలలో ఎన్సిసి యూనిట్ ప్రారంభమై కందుకూరు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తెలియజేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *