తొలి శుభోదయం కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కందుకూరు నవంబర్ నెలలో నిర్వహించిన మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రవికుమార్ విడుదల చేశారు. ఈ మూడవ సెమిస్టర్ ఫలితాల్లో 80 శాతం ఉత్తీర్త సాధించినట్లుగా తెలియజేశారు. బిఏ లో 78%, బీఎస్సీ 86%, బీకాం 76% ఫలితాలు సాధించినట్లుగా తెలియజేశారు. అదేవిధంగా అన్ని గ్రూపుల్లోను మొదటి రెండు స్థానాలలో నిలిచిన విద్యార్థుల యొక్క పేర్లు మరియు వారి సాధించిన మార్కుల శాతాలు ఈ విధంగా ఉన్నాయి.
BAలో: పాలిటికల్ సైన్స్ – టి. సింధూర (80%), సిహెచ్. కార్తిక్ (76%); ఎకనామిక్స్ – కె. రాకేష్ (78%), కె. హైమావతి (64%); స్పెషల్ ఇంగ్లీష్ – బి. రాణి (95%), సిహెచ్. భవాని (85%).
B.Sc లో: గణితం – డి. రమ్య (91%), వి. శ్రావణి (89%); ఫిజిక్స్ – చి. గాయత్రి (84%), ఎల్. చందనా (84%), ఎన్. నందిని (83%); కెమిస్ట్రీ – టి. త్రివేని (93%), కె. శ్రావంతి (90%); బోటనీ – చి. సూర్యనారాయణ (91%), వి. చాందిని (88%).
B.Com (CA) లో: షేక్ సునయన (89%), కె. పరిమళ (86%).
ఈ కార్యక్రమంలో కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ శ్రీ కె .శ్రీనివాసులు, అసిస్టెంట్ కంట్రోలర్ డాక్టర్ జె. హనుమంతరావు మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.