తొలి శుభోదయం సింగరాయకొండ:-

సమాజంలో మహమ్మారిగా విస్తరిస్తున్న క్షయవ్యాధి (టి.బి)ను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టి.బి ముక్త భారత్ అభియాన్కు ప్రతి ఒక్కరూ సహకరించి భాగస్వాములు కావాలని వైద్య ఆరోగ్య అధికారులు పిలుపునిచ్చారు.ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, ఊళ్లపాలెం VHCలో జనవరి 6న TBMBA కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని DMHO టి. వెంకటేశ్వర్లు, DLATO బాలాజీ ఆదేశాల మేరకు నిర్వహించారు.ఈ సందర్భంగా కొండేపి నియోజకవర్గం SMO/MOTC డాక్టర్ కె. ధీరేంద్ర కుమార్, డాక్టర్ నన్నం వంశీధర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టి.బి ముక్త భారత్ అభియాన్‌లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బాధ్యతను గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువ చేయాలని, టి.బి బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు.మంగళవారం సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రంలో ప్రత్యేకంగా ఎఐ ఆధారిత ఛెస్ట్ ఎక్స్‌రే (AI Based Chest X-ray) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల వద్దకే ఆధునిక వైద్య సదుపాయాలను తీసుకువచ్చి, వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడం జరుగుతుందని వివరించారు.గ్రామాల్లో కాలుష్యం మరియు ఇతర కారణాల వల్ల ప్రజలు టి.బి తదితర వ్యాధులకు గురికాకుండా ఉండేందుకు, వ్యాధి తీవ్రతను ముందుగానే అంచనా వేసి చికిత్స అందించే దిశగా వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తోందన్నారు. ఈ ఎఐ ఆధారిత ఎక్స్‌రే ప్లాంట్ ద్వారా ఎక్కడికక్కడే వ్యాధి నిర్ధారణ చేసి తక్షణ చికిత్స అందించే అవకాశం కల్పించబడిందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులు కోరారు.ఈ సందర్భంగా రోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఇదే విధంగా బుధవారం పాకాల పంచాయతీ కార్యాలయంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ధీరేంద్ర కుమార్, STS షేక్ అబ్దుల్ నిస్సార్, STLS కె. కిరణ్ కుమార్, టెక్నీషియన్ దేవరపల్లి శరత్ బాబు, T. శ్రీను (MPHA), 104 సిబ్బంది అడకా శ్రీకాంత్, DEO జె. విజయ కుమారి, ANM కె.వి. సుచరిత, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సిబ్బంది MLHP బి. రాజేశ్వరి, ఆశ కార్యకర్తలు శారద, సుస్మిత, నాగమణి, యశోద తదితర వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *