తొలి శుభోదయం కందుకూరు:-

టీ. ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వయం ప్రతిపత్తి)లో రెడ్ రిబ్బన్ క్లబ్ మరియు NSS విభాగాలు సంయుక్తంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ భాగంగా ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించి, పోస్టర్ ప్రజెంటేషన్ మరియు రంగోలి కాంపిటీషన్స్ విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహించడమైనది. తదుపరి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. డిసెంబర్ 1 వ తేదిన ఎయిడ్స్ వ్యాధిపై విద్యార్థులలో ప్రతి సంవత్సరం అవగాహన కల్పిస్తారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవి కుమార్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి ఇప్పటికీ కూడా సైలెంట్ కిల్లర్ గా ఉందని విద్యార్థులందరూ ఈ విషయాలను గమనించి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కోరారు. రెడ్ రిబ్బన్ క్లబ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఐ అనూష మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి మానవ శరీర వ్యాధి నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని తద్వారా మనిషి ఎయిడ్స్ వ్యాధితో పోరాడలేక ప్రాణాలు కోల్పోతారని తెలియజేశారు. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు- కేవలం నివారణే మార్గమని సూచించారు. అవగాహన కార్యక్రమం అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ ర్యాలీగా తరలి వెళ్లి పుర ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు అందరూ కలిసి మానవహారంగా ఏర్పడి ఎయిడ్స్ వ్యాధి నియంత్రణకి సంబంధించిన నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో NSS కో-ఆర్డినేటర్ కోటపాటి నరేష్ రాజా మరియు డాక్టర్ కె.వి పద్మావతి మరియు IQAC కో-ఆర్డినేటర్ డాక్టర్ పి రాజగోపాల్ బాబు ఇతర అధ్యాపకులు విద్యార్థులు NSS వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *