తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసులు ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు ఓవర్లోడ్‌ నివారించడం, వాహన పరిమితిని పాటించడం, వాహన ఫిట్నెస్ సర్టిఫికేట్‌ను సమయానికి పొందడం, ప్రయాణికుల భద్రత మరియు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాల్సిన అవసరాన్ని వివరించారు.రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రతి డ్రైవర్ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.జిల్లాలో సురక్షిత ప్రయాణ వాతావరణాన్ని ఏర్పరచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *