తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు విజిబుల్ పోలీసింగ్ మరియు వాహన తనిఖీల్లో భాగంగా ఒంగోలు ట్రాఫిక్ పోలీసులు, కాలేజీ విద్యార్థులు మరియు వాలంటీర్లు కలిసి ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంగమూరు రోడ్ జంక్షన్ వద్ద హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి వాహనాలు నడిపిన వాహనదారులకు విద్యార్థుల ద్వారా చాక్లెట్లు మరియు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జగదీష్ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, త్రిబుల్ రైడింగ్ చేయరాదని, అతి వేగంగా వాహనాలు నడపరాదని, మైనర్ డ్రైవింగ్‌కు పాల్పడరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ మోటార్ వెహికిల్ యాక్ట్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యానికి చేరుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *