తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ సూచనల మేరకు, ట్రాఫిక్ పోలీస్ విభాగం జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియమాలు అతిక్రమిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించకుండా వాహనాలు నడుపుతున్న వ్యక్తులపై E-Challanలు జారీ చేయడంతో పాటు వారికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు.
ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ—
Two-wheelers నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
Cars నడుపుతున్నప్పుడు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి
ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ వంటి ఉల్లంఘనలు
ప్రమాదాలకు ప్రధాన కారణమని గుర్తించాలి
చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకే దారితీయవచ్చని జాగ్రత్తపడాలని కోరుతున్నారుప్రకాశం పోలీసులు ప్రజల ప్రాణ భద్రత కోసం ఈ తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.