తొలి శుభోదయం ప్రకాశం:-

ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజల భద్రత మరియు రహదారి సౌకర్యం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్త్ బైపాస్ ప్రాంతంలో, గుంటూరు రోడ్డువైపు రోడ్డు మార్జిన్‌ను ఆక్రమించి ఏర్పాటు చేసిన రోడ్డుపక్క పండ్ల దుకాణాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది.ఈ డ్రైవ్‌ను ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీ డి. శ్రీనివాసరావు నాయకత్వంలో, ట్రాఫిక్ సిబ్బంది సమన్వయంతో నిర్వహించారు. రోడ్డు మార్జిన్‌లను ఆక్రమించడం వల్ల ట్రాఫిక్ ఆటంకాలు ఏర్పడి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉండటంతో, ముందుగా దుకాణదారులకు అవగాహన కల్పించి, అనంతరం ఆక్రమణలను తొలగించడం జరిగింది.ఈ చర్యలతో నార్త్ బైపాస్ రోడ్డులో వాహనాల రాకపోకలు సజావుగా సాగుతూ, ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో కూడా రోడ్డు మార్జిన్ ఆక్రమణలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించి రహదారి నియమాలను పాటించాలని ప్రకాశం జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.ప్రజల భద్రత, ట్రాఫిక్ సాఫీగా నడవడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం పనిచేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *