తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు కనిగిరి పట్టణ పరిధిలోని పామూరు బస్ స్టాండ్ వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన ఆక్రమణ షాపులను తొలగించారు.ఈ చర్యల వల్ల బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో వాహన రాకపోకలకు ఏర్పడుతున్న అంతరాయం తగ్గడంతో పాటు, పాదచారులకు సురక్షితంగా ప్రయాణించే అవకాశం కల్పించబడింది. రోడ్లపై అక్రమ ఆక్రమణలు ట్రాఫిక్ సమస్యలకు, ప్రమాదాలకు దారితీస్తాయని పోలీసులు పేర్కొన్నారు.వ్యాపారులు మరియు ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని, రోడ్లపై ఆక్రమణలు చేయకుండా తమ వ్యాపారాలను నిర్వహించాలని అధికారులు సూచించారు.ప్రజల సౌకర్యం, రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమశిక్షను పరిరక్షించడమే లక్ష్యంగా ఇలాంటి చర్యలు జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతాయని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.