
తొలి శుభోదయం సింగరాయకొండ:-
తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు పిలుపునిచ్చారు.బుధవారం ఆయన సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం, పాకల, దేవళం, బేసిన్ పల్లెపాలెం ప్రాంతాలను సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లి రెవెన్యూ, పోలీస్, పంచాయతీ సిబ్బందికి సహకరించాలి అని సూచించారు.కలెక్టర్ మాట్లాడుతూ, “సముద్రం అల్లకల్లోలంగా ఉంది. ప్రజలు ప్రమాద ప్రాంతాల్లో ఉండకూడదు. తుఫాను తీవ్రతను గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి,” అని తెలిపారు.ఈ సందర్భంగా దేవళం, బేసిన్ పల్లెపాలెం గ్రామాల ప్రజలు తుఫాను సమయంలో వసతుల కోసం కొత్త షెల్టర్ భవనం నిర్మించాలని కలెక్టర్‌కి వినతి చేశారు. కలెక్టర్ ప్రజల అభ్యర్థనపై తుఫాను భవనం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ పర్యటనలో జిల్లా పంచాయతీ అధికారి ముప్పూరి వెంకటేశ్వరరావు, ఎంపీడీవో జయమణి, తహసీల్దార్ రాజేష్, సింగరాయకొండ ఎస్సై మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు