తొలి శుభోదయం:-
మోంతా తుఫాన్ నేపథ్యంలో ఎవరూ ఆందోళన చెందవద్దని, ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రజలతో అండగా ఉంటుందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.మంగళవారం ఆయన క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారి కోన శ్రీధర్‌తో కలిసి సింగరాయకొండ మండలం తీర ప్రాంత గ్రామాలు ఊళ్లపాలెం, దేవళం పల్లెపాలెం, పాకలను పర్యటించి పునరావాస కేంద్రాల ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారని చెప్పారు.
ప్రజలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌డీ ఓ శ్రీలక్ష్మి, తహసిల్దార్ రాజేష్, సీఐ చావా హాజరత్తయ్య, డా. వంశీధర్, సర్పంచ్ సైకం చంద్రశేఖర్, జడ్పీటీసీ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.