తొలి శుభోదయం :-
మొంద తుఫాన్ హెచ్చరికల దృష్ట్యా సింగరాయకొండ పోలీస్ సర్కిల్ పరిధిలో పోలీసులు మరియు మెరైన్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. తీరప్రాంత గ్రామాలు, జాతీయ రహదారి పరిసరాలు, వాగులు వద్ద రక్షణ మరియు సహాయక చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచనలు జారీ చేశారు.
పోలీసు అధికారులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పహారా విధులు నిర్వహిస్తూ, ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా తక్షణమే స్పందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.